అనుకోకుండా వెళ్లా అయినా క్షణం కట్టిపడేసింది..
వేల మంది ఉన్నారు అంతా అతని కోసమే అన్నారు ..చూడపోతే ఎవరి పనుల్లో వారు.. వాళ్ల వాళ్ళని వాళ్ళు వెతుక్కుంటూ ఎంటో హడావిడి...
మధ్యాహ్నం అయ్యే సరికి ఎవరూ లేరు .. చక్కని చిక్కని ఏకాంతం.. ఖాళీ అయిన యాగశాలని చూసినప్పుడు అడగాలి అనిపించింది ..
వేలమంది నీకోసం వచ్చారని ఆనందంగా ఉన్నావా అని అడిగాను... లేదు కానీ వేల రూపులుగా వేచివున్నా నిను బంధింప అన్నాడు... ఎక్కడ పిచ్చి మనసు గంతులు వేస్తుందో ఇక్కడే అల్లుకుపోతానంటూ అని...
మళ్లీ వద్దాం అంటూ చూడాల్సినవి చూసేసి నాలుగు ఫోటోలు తీసుకొని కథ కంచికి నేను మా ఇంటికి...
.కొన్ని పోస్ట్ లు రాయడానికి ఎక్కడో ఒక రంగుల దారం అల్లుకుంటుంది... ఇక్కడ అల్లుకొన్న రంగుల దారం.....అంతర్లోచనలు.. ( స్వగతం ఆర్టికల్) మంజు యనమదల....