అమాయకమైన, కల్మషం లేని బాల్యం. ఏది చెప్పినా నమ్మేస్తుంది కదా. పన్ను ఊడిపోయి నొప్పితో ఏడుస్తుంటే ఆ బాధ మరిపించడానికి మట్టిలో ఊడిపోయిన పన్ను పాతిపెడితే డబ్బులచెట్టు మొలుస్తుందని అమ్మ చెప్తే నిజమని నమ్మి ఏడుపు ఆపి ఆ పన్ను తీసికెళ్ళి మట్టిలొ పాతిపెట్టడం. చెట్టు మొలిచిందా లేదా అని రోజూ చూడడం... పదిరోజులు అలా చూసి మర్చిపోవడం. పుస్తకాలలో నెమలి ఈక పెడితే అది పిల్లలు పెడుతుంది. ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది , బోలెడు డబ్బులు ఇస్తుంది అంటే కష్టపడి. స్నేహితులకు లంచాలు ఇచ్చి నెమలిఈక సంపాదించి పుస్తకంలో పెట్టుకుని అదో అదృష్టరాయిలా అపూర్వంగా చూసుకోవడం. జానపద సినిమాలు చూసి, అమ్మమ్మ చెప్పిన కథల్లోని రాజకుమారులను తలుచుకుని టవల్ తీసుకుని భుజాల మీదుగా కట్టుక్కుని చీపురు పుల్లలతో కత్తి యుద్ధం చేయడం... ఎప్పటికీ మరచిపోలేని మధురమైన జ్ఞాపకాలు కదా.అందమైన జ్ఞాపకాలతో అలరారించే పిల్లల కోసం అపురూపమైన పిల్లల పుస్తకాలు మీకోసం...
హైదరాబాద్ బుక్ ట్రస్ట్....మూడు దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ ..అందులో కొన్ని
అనగనగా కథలు
ఇందులో...1) దొంగవేషం, 2) వ్యాపారికి గుణపాఠం, 3) తల్లిమాట, 4) జమీందారు పెళ్లి, 5) మా మంచి దయ్యం, 6) తెలివైన కోడలు, 7) కట్టెలవాడి కలిమి, 8) అంతులేని ఆశ ... అనే ఎనిమిది సచిత్ర కథలున్నాయి.
36 పేజీలు, వెల: రూ.25
బుడుంగు
ఇందులో...1) బుడుంగు, 2) శ్రీశ్రీశ్రీ నక్కరాజావారు, 3) చేపలవాడు - ద్వారపాలకుడు, 4) గ్రేట్ వాల్, 5) నీలికళ్ల కుందేలు, 6) చిరుగుల టోపి రాకుమారి, 7) చిన్నచూపు, 8) పర్వతకాయుడు, 9) గొంగళిపురుగు అనే తొమ్మిది సచిత్ర కథలున్నాయి.
40 పేజీలు, వెల: రూ.25
చిన్నోడి ప్రయాణం
ఇందులో...1) భలే భహుమానం, 2) గురువుకు ఎగనామం, 3) చిన్నోడి ప్రయాణం, 4) కోతి - జిత్తులమారి నక్క, 5) సాగరకన్య, 6) దాడి, 7) ఫిడేలు రాగం, 8) తాతమ్మ పులి, 9) దున్న గొప్పా - పులి గొప్పా, 10) ఎగిరే బొమ్మలు అనే పది సచిత్ర కథలున్నాయి.
40 పేజీలు, వెల: రూ.25
అనువాదం: డాక్టర్ దేవరాజు మహారాజు, అనుపమ
బొమ్మలు: అన్వర్
మూలం: టాటర్‌హుడ్ అండ్ అదర్ టేల్స్, చైనా జానపద కథలు
మొగ్లీ - జంగిల్ బుక్ కథలు.
రడ్‌యర్డ్ కిప్లింగ్ 'జంగిల్ బుక్' రాసి నూటా ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ పుస్తకం అశేష పాఠకులను ఇంకా అలరిస్తూనే వుంది. ఇందులోని కథలన్నీ 1893-94 సంవత్సరాల్లో వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అనేక సంపుటాలుగా, చలన చిత్రాలుగా, యానిమేషన్ చిత్రాలుగా, నాటకాలుగా వెలువడ్డాయి. బాయ్ స్కౌట్ వంటి ఎన్నో సంస్థలు వాటిని వినియోగించుకున్నాయి. ప్రధానంగా మొగ్లీ చుట్టూ తిరిగే తొమ్మిది కథలను ఈ తెలుగు అనువాదంలో పొందుపరచడం జరిగింది.
మొగ్లీ - జంగిల్ బుక్ కథలు..రడ్‌యర్డ్ కిప్లింగ్
స్వేచ్ఛానువాదం : ప్రభాకర్ మందార
166 పేజీలు, వెల : రూ. 100/-
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాల కోసం సంప్రదించండి...హైదరాబాద్ బుక్ ట్రస్ట్ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,గుడిమల్కాపూర్, హైదరాబాద్ 500006 ఫోన్ నెం. 040 2352 1849Email: hyderabadbooktrust@gmail.com‘ఎమెస్కో’ తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ‘ఎమెస్కో’ యద్దనపూడి సులోచనారాణి, ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి, యండమూరి వీరేంద్రనాద్, మల్లాది వెంకటకృష్ణమూర్తి, కొమ్మనాపల్లి గణపతిరావు, యర్రంశెట్టి సాయి వంటి రచయితల, కాక ..మరెన్నో పిల్లల పుస్తకాలు వెలువరిస్తోంది.(Website: emescobooks.com/books)అక్బర్-బీర్బల్..రచయిత: మల్లిక్..40/-Rsనసీరుద్దీన్ కథలు..రచయిత: మల్లిక్..40/-Rsతెనాలి రామకృష్ణ కథలు..రచయిత: మల్లిక్..40/-Rsఅపూర్వ జానపదకథలు..రచయిత: : డా. దేవరాజు మహారాజు..75/-Rsఎమెస్కో బొమ్మల రామాయణం (రూ.35/-) ఎమెస్కో బొమ్మల భాగవతం (రూ.35/-)ఎమెస్కో బొమ్మల భారతం (రూ.50/-) ఎమెస్కో బొమ్మల పంచతంత్రం (రూ.50/-)చిట్టిపొట్టి కథలు..రచయిత: ఎమెస్కో రచయిత (20 పుస్తకాల సెట్టు) రూ.300/-పిల్లలు రాసిన పిల్లల కథలు (10 పుస్తకాల సెట్టు)..రచయిత:ఆంధ్రజ్యోతి - ఎమెస్కో రూ.250
ఎమెస్కో పుస్తకాల కోసం సంప్రదించండి...
హైదరాబాద్(ప్రధానకార్యాలయం)
Phone: 040-23264028
Fax: 040-23264028
చిరునామ 1-2-7, బాను కాలనీ, గగన్ మహల్ రోడ్,
దోమల గూడ, హైదరాబాద్. 500 029.
Email ID: emescohyd@gmail.com,emescobooks@yahoo.com
విజయవాడ
Phone: 0866-2436643
Fax: -
సంప్రదించవలసిన వ్యక్తి: జి.లక్ష్మీ
Email ID: sahithi.vij@gmail.com
‘ఎమెస్కో’స్వగతం (నా 80 ఏళ్ళ ప్రయాణం)నాకు జన్మనిచ్చింది ఎమ్.ఎన్.రావుగారు. వారి తండ్రిగారి పేరు ఎమ్.శేషాచలంగారు. వారి పేరున ఎం.శేషాచలం అండ్ కంపెనీగా నాకు నామకరణం చేశారు. దానిని కుదించుకుని ఎమెస్కోగా మారాను నేను. ఎమెస్కోగానే నేను అందరికీ తెలుసు.
ఎమెస్కో బుక్ క్లబ్ ద్వారా సుప్రసిద్ధ నవలా రచయతల, రచయిత్రుల నవలలను మీకు అందించాను. యద్దనపూడి సులోచనారాణి, ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి, యండమూరి వీరేంద్రనాద్, మల్లాది వెంకటకృష్ణమూర్తి, కొమ్మనాపల్లి గణపతిరావు, యర్రంశెట్టి సాయి వంటి రచయితల, రచయిత్రుల నవలలు ప్రతి నెలా మీకు అందుబాటులోకి తెచ్చాను. ఇంటింటా గ్రంథాలయం పథకం ద్వారా ఎమెస్కో ప్రచురణలే కాక రాష్ట్రంలోని వివిధ ప్రచురణకర్తల పుస్తకాలను మీకు అందుబాటులోకి తెచ్చాను. దేశంలో లక్షలాది గృహ గ్రంథాలయాలు ఏర్పడటం నన్ను మీకు మరింత దగ్గర చేసిన పరిణామం.
ఉక్రేనియన్ జానపద గాథలు 1 - 4 (పిల్లల పుస్తకాలు | కినిగె బ్లాగు)
ఉక్రేనియన్ జానపద గాథలు అపారంగా ఉన్నాయి. పాతకాలం నాటి వీరుల్ని, సంఘటనల్నీ ఈ గాథల్లో అడుగు అడుగునా మనం చూస్తాం. సామాన్య ప్రజలలో ధైర్యం ఉన్న మనుషులూ, ఉల్లాసం కలిగించే సాహసకృత్యాలు, చలాకీగా ఉండే జంతువులూ, పక్షులు పాఠకులకి సంతోషం కలిగిస్తాయి.
ప్రకృతి గురించీ, పెంపుడు జంతువుల గురించీ ప్రాథమిక జ్ఞానాన్ని జానపద గాథలు పిల్లలకి అందిస్తాయి.
మంచి పుస్తకం వారు ప్రచురించిన ఈ నాలుగు పుస్తకాలు కొనండి 16.67%తగ్గింపు పొందండి. for details click here http://kinige.com/koffer.php?id=27
పాల పిట్ట కథలు - విశాలాంధ్ర బుక్ హౌస్
మన చిన్నారుల కోసం ఓ మంచి పుస్తకం ! మన పిల్లలకి అపురూప బహుమతిగా యివ్వ తగిన ఒక చక్కని పుస్తకం పాల పిట్ట ప్రపంచ జానపద కథలు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు కొత్తగా వెలువరించారు!పత్రికా రచయిత, నవ్య వార పత్రిక సంపాదకులు, నవలా కథా రచయిత, టి.వి, సినిమా రచయితగా ప్రసిద్ధులైన శ్రీ జగన్నాధ శర్మ బాల సాహిత్యం మీద ఎనలేని మక్కువతో ప్రపంచ ప్రఖ్యాత జానపద కథలను పాఠకులకు అందించారు.ప్రముఖ కవి శివారెడ్డి ఆవిష్కరించిన ఈ పాల పిట్ట పిల్ల పుస్తకం రూ. 90 లకే లభ్యమైతోంది.
పాలనా రహస్యం
పాలనా రహస్యం పిల్లల కథల పుస్తకాన్ని రచయిత: బి.వి. పట్నాయక్. ఇందులో 24 కథ లున్నాయి. పుస్తకం వెలం:30 రూపాయలు. పుస్తకం కావలసినవారు విశాలాంధ్ర బుక్ హౌస్ ఏ బ్రాంచీనయినా సంప్రదించవచ్చు.
చాల మంచి విషయాలు తెలిపినారు రమాదేవి గారు కృతజ్ఞతలు