ఎన్నో చిన్న చిన్న అనుభూతులు, మనలో మెదిలే ఎన్నో ఆలోచనలు,అందులో కొన్నిఎంతో ఉన్నతంగా ఒక సమయంలో అనిపిస్తాయి ..మరికొన్నిమనసు ఒప్పుకోలేనిజీవితసత్యాన్ని స్పురణకు తెస్తాయి...ఇలా ప్రతీ ఒక్కరికి అనుభవంలోకి వచ్చేఉంటుంది....ఇవే కాదు ఇలాంటివి ఎన్నెన్నో...అందరితో ఉన్నామంటూ అరచేతఒంటరితనం ... మనసుని మెలిపెట్టే అలల లాంటి మనసుపొరల్లోనిజ్ఞాపకాలు..ఉన్నతమైన అనుభవాలు..చిన్న పొరపాటుతో జారిపోయిన ఆనందం..ఇలాప్రతీ ఒక్కటి మనలో ఎన్నో ఆలోచనలని, కొన్ని నిస్పృహని,మరికొన్ని అద్భుతమైనస్పందనని కలిగిస్తాయి..అపుడు మనలో కలిగే భావోద్వేగాలకు అక్షర రూపంకలిగిస్తే........కొన్ని కొంతకాలం గడిచాక మనల్నే ప్రశ్నిస్తాయి,కొన్నిమనల్నే విబ్రాంతి పరుస్తాయి, మరికొన్ని కొత్త జీవితసత్యాన్నితెలియచేస్తుంటే ...ఇవన్ని నాలోని ఆలోచనలేనా అని ఆశ్చర్యపోక తప్పదు...ఇవిబ్రహ్మ నా చెవిన చెప్పిన సత్యాలేమో అని అందమైన ఊహ కలగక తప్పదు...అందుకేమదిలోని ఆలోచనలకూ అక్షరరూపలైన నల్లమోతు శ్రీధర్ గారి ఈ ఆర్టికల్స్....విరంచి మీటిన మనసు విపంచి అయ్యింది....
మన విమర్శల్లో లోతెంత?
సహజంగా ప్రతీ మనిషిలోనూ నివురుగప్పిన అసంతృప్తులు చల్లార్చడానికి, వాటినిప్రకటితం చెయ్యడానికి కొన్ని అంశాలు కావాలి. సామాజిక జాఢ్యాలను ఎండగట్టడంవల్ల కొంతైనా ఈ అసంతృప్తులు బంధవిమోచనం పొంది మనసు కుదుటపడుతుంది. ఈక్షణం రాజకీయాలను దూషిస్తూ మనం గళం ఎత్తామంటే దానికి మూలం ఆ రాజకీయాలుఒక్కటే కారణం కాదు, ఇతరత్రా ఎన్నో అసంఘటిత అసంతృప్తులు మనసులో ఇమడలేక ఏదోరూపేణా, ఏదో ఒక బలీయమైన అంశం ఆసరాగా సమాజంపై, వ్యవస్థపైవెళ్లగక్కబడుతుంటాయి. అలాంటి అసంతృప్తులు విమర్శల జడివానలాపెల్లుబికేటప్పుడు మనం విమర్శించడానికి ఎంచుకున్న అంశం ఒక్కటే బయటిప్రపంచానికి ప్రదర్శితం అవుతుంది తప్ప ఆ అంశానికి మూలాధారాలైన అస్పష్టఅసంతృప్తులు నిగూఢంగానే ఉండిపోతాయి. అందుకే ఏ విమర్శకైనా నిర్థిష్టమైనఆధారం ఉండదు. తిట్టాలనిపిస్తోంది కాబట్టి తిడుతుంటాం. ఎందుకు తిట్టాలిఅని ఎదురు ప్రశ్నించుకుంటే ఆ అంశంపై మనకున్న వ్యతిరేకత కన్నా మనలోగూడుకట్టుకున్న ఇతర అసంతృప్తులదే కీలకభూమిక అని తేలుతుంది. అకారణంగాప్రతీ దాన్నీ విమర్శిస్తూ ఓ రకమైన అసంతృప్తివాదులుగా చలామణి అయ్యే వారుఎక్కువగా ఈ కోవకు చెందుతుంటారు. జీవితంలో మూటగట్టుకున్న చేదు అనుభవాలుప్రతీ దానిలోనూ లోపాలు ఎత్తిచూపే తత్వాన్ని మిగల్చడం వల్ల… బలీయమైన కారణంలేకపోయినా అన్ని అంశాల పట్లా నిరసన గళమే వీరిలో ప్రస్ఫుటంగాకన్పిస్తుంటుంది.ఇదిలా ఉంటే అందరికీ బాగా కన్పించే దానిలో లోపం వెదికిపట్టి మరీ అందరిదృష్టినీ ఆకర్షించాలన్న తపన కొందరిలో కన్పిస్తుంది. ఆయా అంశాలతోవాస్తవానికి వీరికి ఎలాంటి సమస్యా ఉండదు. ఆ అంశం లోతుపాతులు తెలిసిఉండవలసిన అవసరం కూడా వీరికి లేదు. ఆ అంశంపై అనుభవం, అవగాహన లేకపోయినాభౌతికంగా ఆ సమస్య ఎలా కన్పిస్తుందో ఆ నిర్మాణాన్ని స్థూలంగా మనసులోకితీసుకుని విశ్లేషించి యధేచ్ఛగా విమర్శకు దిగుతుంటారు. ఇక్కడ వారి లక్ష్యంతమ తార్కికత పదిమంది గుర్తించాలన్నది. సమస్యపై గతానుభవం వల్ల వచ్చే గాఢతలేకపోతే ఇప్పటికప్పుడు అల్లుకున్న తర్కం నిష్ర్పయోజనం అన్నది వారుగుర్తించలేరు.అసంతృప్తుల వల్లనైతేనేమి, గుర్తింపు యావతోనైతేనేమి ఏ అంశంలో అయినా మొదటమనం చెడునే చూడగలుగుతున్నాం అంటే మన మనస్సు విమర్శలు, వివాదాలకు మాత్రమేఆనందం పొందేలా లంగరు వేయబడిందన్నమాట. సమాజంలో అక్కడక్కడ మంచిజరుగుతోందంటే నమ్మలేనంత, నమ్మినా దాన్ని జీర్ణించుకోలేనంత, ఆ మంచినిలేనిపోని సందేహాలతో నిరుత్సాహపరిచేటంత మైకంలో కూరుకుపోయినట్లు లెక్క.. మనవిమర్శలకు ఏ సామాజిక జాఢ్యాలను ఆసరాగా తీసుకుంటున్నామో అంతకన్నా బలీయమైనమానసిక జాఢ్యాలు మనల్ని నిలువునా ముంచేసి మనకు తెలియకుండానే మనల్ని సంఘవ్యతిరేక శక్తులుగా తయారు చేసినట్లు గుర్తించాలి.చివరిగా ఇది ఓ ఒక్కరినో గాయపరచడానికి చేసిన విశ్లేషణ కాదు.విమర్శించడంలోనే ఎక్కువ ఆనందం చూస్తూ మంచిని గ్రహించలేకపోతున్న మనలోని ఓపార్శ్యాన్ని వెలికి తీసే ప్రయత్నమే ఇది. మన మనస్థత్వాన్నీ స్వయంగావిమర్శించేదిగా ఉన్న ఈ విశ్లేషణా ఓ రకంగా విమర్శే. కాకపోతే మానవమనస్థత్వాన్ని ఆవిష్కృతం చెయ్యడం కోసం ఇది విమర్శ రూపం సంతరించుకోకతప్పలేదు.
Update:ముంబాయి బాంబుపేలుళ్ల ఘటన చాలా కలిచివేసింది. ఎంత నిభాయించుకున్నా దానికిస్పందించకుండా ఎవరం ఉండలేం. ఆ ఘటన జరగకముందు నిన్న సాయంత్రం రాయబడినఆర్టికల్ ఈ “మన విమర్శల్లో లోతెంత?” అనేది. దయచేసి ఎవరూ ఆ ఘటన పట్ల మనలోవ్యక్తమయ్యే నిరసనలకు ఈ ఆర్టికల్ కీ ముడిపెట్టవద్దని మనవి.
- నల్లమోతు శ్రీధర్ , Nov 27, 2008 (jan 14th 2011 in facebook)
మనుషుల్ని కాదు.. మనసుల్ని గెలుద్దాం..
ఎంతో ఆత్మీయంగా ఉండే ఇద్దరు మిత్రుల మధ్య ఏ పనుల వత్తిడో, చిన్నపాటిఅభిప్రాయబేధమో తలెత్తితే అది క్రమేపీ పూడ్చలేనంత అగాధమవడానికి ఏతావాతాఎన్నో కారణాలుండొచ్చు. కానీ అన్నింటి కన్నా పెద్ద కారణం మాత్రం అపసవ్యమైనవారిద్దరి ఆలోచనాధోరణే! ఈ ప్రపంచంలో ఒక మనిషి మనకు దగ్గరవ్వాలంటే ఎన్నోమనస్తత్వ విశ్లేషణలు, నిజనిర్థారణలూ అవసరం అవుతున్నాయి. అదే కొద్దిగాతేడా వస్తే చాలు.. ఎలాంటి సంజాయిషీలూ, క్షమించడాలూ లేకుండా క్షణకాలంలోవారికి దూరమైపోతున్నాం. ఓ మనస్పర్థ వస్తే చాలు.. తప్పయినా ఒప్పయినా మనంఅనుసరించే పద్ధతే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతున్నాం. అందుకే మనసుల మధ్యఏర్పడే అగాధాన్ని పూడ్చుకోవాల్సింది పోయి మొండిపట్టుదలతో బింకంగాహఠమేస్తున్నాం.. ‘మనకేం అవసరం.. వస్తే వాళ్లే వస్తారులే’ అన్న అహంకమ్ముకుపోతుంది. అంతా సక్రమంగా ఉన్నప్పుడు ఆ ఇద్దరూ ఒకరికొకరు ఎంతో సాయంచేసుకుని ఉంటారు. ఓ చిన్న అపార్థం బుర్రని తొలవడం మొదలు.. ‘వాళ్లు మనకుచేసిందానికన్నా మనం వాళ్లకు ఎంతో సాయం చేశామని.. మనం లేనిదే వాళ్లకుజరుగుబాటు కాదని’ గత జ్ఞాపకాలను ప్రేమతో మానేసి ద్వేషంతోగుర్తుకుతెచ్చుకుంటాం. గతంలో అవతలి వారి చిరునవ్వులకు పులకించిపోయిన మనసుకాస్తా ద్వేషంతో ఆ జ్ఞాపకాలు గుర్తుకువచ్చినప్పుడు ఆ నవ్వులనే గుర్తుచేసుకుని మరీ చిటపటలాడుతుంది.
హ్యూమన్ సైకాలజీ, బాడీ లాంగ్వేజ్‌లు, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో మనుషులమనసుల్ని త్వరగా గెలవగలిగే మెళుకువలు అలవర్చుకుంటున్నాం. కానీ అందులోఎక్కడా చిక్కదనం లేదు. ఫైవ్‌స్టార్ హోటల్‌లో రిసెప్షనిస్ట్ నవ్వుకీ మననవ్వుకీ తేడానే లేదు. రెండు నవ్వులూ అరక్షణమే విచ్చుకుంటాయి. అంతలోనేమూసుకుపోతాయి. కృత్రిమ హావభావాలతో కూడిన అచ్ఛమైన ప్రొఫెషలిజం! ఇంతసులభంగా మనుషులకు దగ్గరవగలిగే మనం, ఇంత సులభంగా మనల్ని మనం మార్కెట్‌చేసుకోగలిగే మనం.. గాఢమైన అనుబంధాలను ఎందుకు పెనవేసుకోలేకపోతున్నాం?అందమైన చిరునవ్వులు, పొందికైన మాటలూ, ముచ్చటగొలిపే ముఖకవళికలు,ఆకర్షణీయమైన ఆహార్యం.. అన్నీ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని మరీనేర్చుకుంటున్నాం. ఎందరినో పరిచయం చేసుకుంటున్నాం, సాన్నిహిత్యంపెంచుకుంటున్నాం, అనుబంధపు మాయమాటలతో ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ అవసరాలుతీర్చుకుంటున్నాం.. రైలు ప్రయాణంలో స్టేషన్ వస్తే దిగిపోయేప్రయాణీకుల్లా అంతే అవలీలగా తప్పుకుపోతున్నాం. మరో రైలు, మరో మజిలీ,మరికొన్ని స్నేహాలూ.. జీవితం సాగిపోతూనే ఉంటుంది. కొత్త మనుషులుకలుస్తూనే ఉంటారు. అవసరాలు తీర్చేసుకుని ఏదో ఒక సాకుతో ఒకరిపై ఒకరుద్వేషం పెంచుకుని దూరమవుతూనే ఉంటారు. స్నేహంలో అవసరాలు ఒక భాగం మాత్రమే..అవసరాలు తీర్చుకోవడానికే స్నేహం ముసుగు వేసుకోవలసి వస్తే ఆ అవసరాలుతీరగానే ఆ స్నేహానికి నూకలు చెల్లినట్లే! అందుకే మనుషుల్ని ప్రేమిద్దాం,అభిమానిద్దాం, సహకరించుకుందాం.. అంతే తప్ప మనుషుల్ని జీవితంలోపైకెదగడానికి పావులుగా వాడుకునే నైపుణ్యతలు ఎన్ని అలవర్చుకున్నా మనసులోస్వచ్ఛత లేనప్పుడు ఆ అనుబంధాలకు బలమెక్కడ?
- నల్లమోతు శ్రీధర్ , సెప్టెంబర్ 2010 కంప్యూటర్ ఎరా సంపాదకీయం
నిజంగా మనం మంచి వాళ్లమా?
·అలసిన ఓ నిమిషం కళ్లెదుటి బాహ్యప్రపంచాన్ని బలవంతంగా కనురెప్పల బిగింపుతోతిరస్కరించి కళ్లు మూస్తే ఎన్నో అలజడులు కళ్లల్లో ఎగిరెగిరి పడుతున్నాయి.బాల్యపు "నేను"కీ, యవ్వనానికీ, నిన్నటికీ, ఇప్పటి "నేను"కీ సారూప్యతదొరకబుచ్చుకోలేక మెదడు జ్ఞాపకాల దొంతరుల్ని తిరగేస్తూనే ఉంది. అంతలో ఏసమూహంలోనో అభిప్రాయాలు ఆరాటపడుతూ మనుషుల నాలుకల్ని తొలుచుకు వచ్చేటప్పుడు"నేనలా.. తెలుసా" అంటూ మనసూ ఉండబట్టలేక బలహీనంగా మూలుగుతుంది. నా గురించినేను చెప్పుకోవడానికి ఎంత ఆరాటమో కదా! "అహం" తన లోతుల్ని తానుతవ్వుకోలేక, నిశ్చలత్వాన్ని పొందలేక నిరంతరం ఊగిసలాడుతూ కూడా ఓ అనిశ్చితఅభిప్రాయాన్ని "స్థిరమైనదిగా" ప్రకటితం చెయ్యడానికి పడే తపన చూస్తుంటేమంచివాళ్లగానో, దయాపరులు గానో, మేధావులుగానో.. ఏదో ఒక స్థిరమైన ముద్రనిఆపాదింపజేసుకోవడానికి మారుతుండే చిత్తాలతోనే ప్రయత్నాలు సాగించడంహాస్యాస్పదంగా తోస్తుంది. తీవ్రమైన సంఘర్షణ తీరం దాటని తుఫానులా మనసునితడుపుతున్నా బండబారిన స్థితప్రజ్ఞుల్లా ముఖకవళికల్లో రక్తికట్టించడానికికుదేలైన కండరాల్ని బిగదీసి మరీ నటనావైధుష్యాన్ని ప్రదర్శించడంరివాజైపోయింది. కోరుకున్న ముద్రల కోసమే అభిప్రాయాలూ సహజత్వాన్ని కోల్పోయిహంగులు అద్దుకుంటున్నాయి. అన్నింటిలోనూ "ఈ క్షణానికే నిశ్చితంగా ఉండేనిశ్చితాభిప్రాయాలు" మన స్వంతం. కానీ ముద్రలు మాత్రం శాశ్వతమైనవి కావాలి.గతించిన అభిప్రాయానికీ, మారిన ఆలోచనకు లంకె వేస్తే పుటుక్కున భండారంబయటపడుతుందన్న ఆలోచనా స్ఫురించదు. మనపై సమాజం వెయ్యాలనుకునే ముద్రనిసాధించడానికి ఇచ్చినంత విలువ మన ఆలోచనల్లో స్థిరత్వం పొందడానికి ఇవ్వం.అందుకేనేమో ముద్రలు ముఖస్తుతికి పనికొస్తుంటే మారుతుండే మన ఆలోచనలుకొరుక్కునే చెవుల్లో నిందలుగా షికారు చేస్తుంటాయి. మంచివాడో, గొప్పవాడో,త్యాగశీలో, మేధావో వంటి ముద్ర మన సమక్షంలో బలంగా విన్పిస్తే చాలు.. మనంఅవేం కాకపోయినా అహం సంతృప్తిపడి శాంతిస్తుంది.
- నల్లమోతు శ్రీధర్ , January 1, 2011