ప్రేమ ఆంటే అని ప్రశ్నించేవాళ్ళు చాలా మంది ఉంటారు దానికి సరియైన సమాధానం చెప్పేవాళ్ళు ఎందరు కనిపిస్తారు.. ఎవరడిగినా చెప్పేది మాత్రం..విశ్వజనీయమైన ప్రేమ అత్యుత్తమమైనది అని..నిజంగా మనము అలాంటి ప్రేమను చూపించగలమా...పశు పక్షాదులను,చెట్లు చేమలను ,పిన్నలను పెద్దలను తారతమ్యం లేకుండా ప్రేమించగలమా.....ప్రేమకు నిర్వచనం చెప్పడం కూడా చాలా కష్టమైనా విషయమే..
ప్రేమించే హృదయం ఉన్నవాడు ...అందరిని క్షమించే గుణం ఉండాలా... నిజంగా అందరిని క్షమించడం అన్న విషయం వినడానికి చాలా చిన్నగా ఉన్న ఆచరణ విషయానికి వచ్చేసరికి ఎంత కష్టమో అర్ధమవుతుంది..మనిషిలో ప్రేమించే గుణం కన్నా ద్వేషం, అసూయా, పంతం అన్నవే ఎక్కువ ప్రేరణ కలిగి ఉంటాయి.. ఇవన్నీ ఒక ఇంటి సంతానం లాంటివే...జీవితకాలమంతా ఒకరిని ద్వేషిస్తూ ఉండగాలరేమో గాని...ద్వేషాన్ని మరచి వారి తప్పులను మరచిపోయి క్షమించలేరు ..ఒక వేళ క్షమించాను అని చెప్పినా అది నమ్మదగ్గవిషయంగా ఎపుడు పరిగణింపబడుతుంది తిరిగి వారిని ప్రేమించ గలిగినపుడు మాత్రమే.. ద్వేషాన్ని మరిచి ప్రేమించే వారు ఉండరా ఆంటే...ఉంటారు వారిని రాగద్వేషాలకు అతీతమైన యతిపుంగవులుగా పరిగణించవచ్చు.
అసూయ అన్నది నిప్పురవ్వకోసం ఎదురుచూసే ఎండుకర్రలాంటిది. పంతం రగులుకుంటున్న అగ్నిపర్వతం లాంటిది...ద్వేషం నివురుకప్పిన నిప్పులాంటిది... ఎదుటిమనిషిలోని ఈ ద్వేషం గుర్తించడానికి ఒకోసారి జీవిత కాలం సరిపోదు.. ఈ భావోద్వేగాలన్నీ మనిషినీ ఒక ఉన్నత స్థానం అందుకోడానికి అడ్డుగోడలే...
ఈ అడ్డుగోడలా వల్ల నష్టపోయే మనం ఏమి చేయాలి..ఋషి లా ద్వేషం విడనాడి అందరిని ప్రేమించాలా...మనం అంతటి వేదాంత ధోరణి లో ఉండకున్న...మన ఉన్నతికి అడ్డుగోడలను తొలగించుకోవడం మాత్రం తప్పని సరి అని అందరు ఒప్పుకునే సత్యం .....
మన ఉన్నతి కోసం .... మనం అభిమానించే వారితో ద్వేషం ఉన్నవారి గురించి మాట్లాడడం...చర్చించడం ...పూర్తిగా మానివేయడం.. వారికి మన సహాయ సహకారాలు నిలిపివేయడం..అందులో అవతలి వ్యక్తి ఎంత నష్టపోతాడు అన్నది నీ ఆలోచనలోకి రాకూడదు...మన సహకారాలు ఆపివేయడం అన్నది కూడా మన మనసుకు నచ్చకపోవచ్చు..ఈ కొంచెం చేద్దాం అంటూ అడుగు ముందుకు వేయడం...అందుకు అవతలి వారు ఎటువంటి కృతజ్ఞత కనపరచక పొతే,ద్వేషం పెరగడానికి కారణం అవుతుంది. మనం ద్వేషించే వారిని గురించి నిజాయితీగా ఎవరిదీ తప్పు అని అంచనా వేయడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే ఎవరికీ వారే వారి వాదనే సరి అయినదని నమ్మడం సహజం. వీలైతే వారిని అసహ్యించుకొని వారినుంచి వారి పరిసరాలనుంచి దూరంగా వెళ్ళడం.. అలా చేయడానికి మన మనసు ఒప్పుకోడు..తప్పు చేయకుండా ఎందుకు వారి నుంచి తప్పుకోవాలని ప్రశ్నిస్తుంది...కానీ మనం మన చుట్టు ఉన్న మన వాళ్ళకోసం రాజీ పడడం ఆంటే ఎదుటివారికి తలవంచడం లేదా ఓడిపోవడం అనే భావన రానీయకూడదు...మన ఉన్నతి మీద ఆశ పడేవాళ్ళు, మనం బాధ్యత వహించేవాళ్ళు, మన వాళ్ళ మీద ఉన్న ప్రేమే కారణం అన్నది పదే పదే గుర్తుచేసుకోవాలి...
అబద్దం ఆడరాదు అన్నది అందరూ చెప్పగలరు..కానీ ఆచరణ పెట్టేవాళ్ళు ఎందరు.. అలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయాల్లో అబద్దం ఆడకుండా ఉండు అని నిర్దేశించి చెప్పడం ఆచరణ యోగ్యం...అలాగే ద్వేషం విడనాడు అందరినీ ప్రేమించు అని చెప్పడంలో ఉన్న సత్యం కంటే... నీలోని ప్రేమించే మనసుని ద్వేషం నాశనం చేయకుండా చూసుకో అనడం ఆచరణ, ఆమోద యోగ్యం కదా..
అభ్యుదయ భావాలు, ఉన్నతమైన వ్యక్తివం ఉన్న వారికి ద్వేషం అన్న పదం వారి మనసుని తాకకపోవచ్చేమో..కానీ మన జీవితంలో ఎదురయ్యే ఒక సగటు మానవుడి స్పందనలు, వారి భావోద్వేగాలు, వారినే కాదు వారి చుట్టూ ఉన్నవారి మనశ్శాంతిని కూడా హరించి వేస్తుంది. మనలోని ద్వేష భావం మన అని అనుకున్నా వాళ్ళని కూడా చుట్టుముడుతుంది. అందుకే ద్వేషానికి ఒక కంచే కట్టడం అవసరం..మనల్ని..మన వాళ్ళని ...మన ఉన్నతికి అడ్డు పడకుండా ఉండడానికి.
ద్వేషించడం అన్నది...ఎపుడో ఒకప్పుడు మనకు ఎదురు పడొచ్చు...అందులో మన పాత్ర ఎంత అన్నది అప్రస్తుతం..కానీ దాని నుండి తప్పుకొని మనుగడ సాగించడం మన కర్తవ్యం..ప్రేమను మన అరచేతిలో దాచుకోవడం మన బాధ్యత...యిలా ఒక భావోద్వేగాన్ని ఉన్నతికి అడ్డుగోడ అని నిందా పూర్వకంగా అనడానికి కారణం ..మనలో మనం గుర్తించిన మంచి, జీవితం చివరివరకు మిగిలి ఉండాలన్న ఒక చిన్న ఆశతో మాత్రమే...
ప్రేమకు స్వేచ్ఛనివ్వండి...ద్వేషానికి కంచె కట్టండి...మీ ఉన్నతికి రహదారి మీరే ఏర్పరుచుకోండి....