ఫేస్ బుక్ ... ఫ్రెండ్ షిప్
మనకు తెలిసిన విషయాన్ని ఎక్కువ మంది తో షేర్ చేసుకోవడానికి, ఎంతో మంది షేర్ చేసిన వాటి నుంచి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోడానికి ఉపయోగపడే అత్యుత్తమ రేటింగ్ సాధించిన సోషల్ నెట్వర్క్ గా ప్రసిద్ది గాంచిన "పేస్ బుక్".
పేస్ బుక్ క్రియేట్ చేసిన ఉద్దేశం .. ముఖ పరిచయం ఉన్నవాళ్ళు ఆప్తులు, స్నేహితులు, బంధువులు, ఇలా అందరూ ఉన్నా అందరిని ప్రతిరోజూ పలకరించడం కానీ, ఎలా ఉన్నావు అని కానీ మనసుకు అడగాలని ఉన్నా మన వ్యవహారాలతో అది అందని ఎండమావి అయ్యింది..మనుషులే కరువవు తున్న ఈ కాలం లో మనకు తెలిసినా వాళ్ళు, మనవాళ్ళు, నాతో ఉన్నారు అనే ఒక భద్రతా భావం కలిగించడం ఈ పేస్ బుక్ ఉద్దేశం అనుకుంటే, అలాగే ఒకే అభిరుచి ఉన్నవాళ్ళందరినీ ఒక చోట కూడి తమ అభిప్రాయాలను విషయ సేకరణకు వేదికగా నిలబడడానికి ఉపయోగపడుతుంది ఈ పేస్ బుక్
ఉద్యోగస్తులైన తల్లితండ్రులు ఉన్న ఇంట్లో పిల్లలకు తన ఆటలకు, తన మాటలకు ఈ పేస్ బుక్ ఒక ఫ్రెండ్ గా మారడం అతి సహజం..ఉద్యోగ వేటలో ఒంటరిగా ఉన్న యువతకి అందుబాటులోని నేస్తం, కాలేజీ పిల్లలకు ఒక ఆటవిడుపు..ఉన్నత రంగంలో ఉన్న వారి ఆశలు, ఆశయాలు అతి తక్కువ సమయంలో ఎందరికో చేరవేసే అత్యుత్తమమైన పోస్ట్ మాన్.. ఇందులో 8 సంవత్సరాల పిల్లలనుండి 70 సంవత్సరాల వృద్దుల వరకు కూడా ఈ పేస్ బుక్ తో గడుపుతున్నారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు ఇది ఎంత బాగా అందరిని ఆకట్టుకుందో..
కానీ ఇపుడు పేస్ బుక్ అన్నది మనిషిలో అభద్రతా భావం కలగడానికి, చిన్నారి పిల్లలు ఒక విషవలయం లొ చిక్కుకోడానికి, యువత ఆత్మహత్యలకు పురికొల్పడానికి ఇది ఒక ఆయుధంగా , వికృత చేష్టలకు ఒక అవకాశం ఇచ్చే రహదారిగా, ఈ పేస్ బుక్ ఒక కారణంగా మారడం మొదలయ్యేసరికి తప్పు ఎక్కడా జరుగుతుందా అని ప్రతీ వాళ్ళు అలోచించే పరిస్థితి వచ్చింది.
సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు మంచికి ఎంతగా ఉపయోగపడుతున్నాయో అంతగా వీటి ద్వారా నష్టపోతున్న వారూ ఉన్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు వేదికగా ఎన్నో నకిలీ ప్రొఫైళ్లు చలామణి అవుతున్నాయి. ఎంత ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే అంత గొప్పగా ఉంటుంది..తను పెట్టె స్టేటస్ కి ఎన్ని కామెంట్స్ వచ్చాయా అని చూసుకోవడంలోనే త్రిల్ గా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక టీన్ ఏజ్ లో ఉన్న పిల్లల విషయంలోనే కాదు, సెలబ్రేటీస్ కూడా ఇందుకు మినహాయింపు ఏమి కాదు. తమకు ఒక గొప్ప గుర్తింపును ఇచ్చే ఈ సైట్ కి ఒక విధంగా అడిక్ట్ అవుతున్నారు..మానసికంగా పేస్ బుక్ తో ఎక్కువ సమయం గడపడానికే మొగ్గు చూపుతున్నారు.
నిజంగానే స్టేటస్ లో మనం పెట్టిన దానికి ఎవరు ఎలా స్పందిస్తారు అని చెప్పడం కష్టం...ఎందుకంటే ఇందులో మనకు తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళే ఎక్కువ ఉంటారు, పేస్ బుక్ లో మనుషుల మధ్య సన్నిహితం తక్కువ.... ఎవరి మానసిక స్థితిని బట్టి వారు దానిపైన కామెంట్ చేస్తారే తప్ప మనవైపు నుంచి అలోచించి స్పందించేవారు తక్కువ..మానసికంగా కృంగిపోయి ఉన్న మనిషి తన స్టేటస్ లో ఏదైనా వ్రాస్తే దానికి తను అనుకున్నా స్పందన రాకపోతే ఆ పరిస్థితి లేదా తన సమస్యను ఒక జోక్ గా తీసుకొని కామెంట్ చేస్తే అవి అతని ఆత్మహత్యకు ప్రేరేపణగా మారుతున్నాయి...
ఇలాంటి పరిస్థితి రావడానికి ఎవరినీ తప్పు పట్టేటట్టుగాలేదు. మనకు మనం కొన్ని నియమాలు పాటించడం మినహా..
పేస్ బుక్ వాడకంలో కొన్ని నియమాలు పాటిస్తే ...... పేస్ బుక్ కొన్ని సెక్యూరిటీ లు కలిపించింది వాటిని మనం ఉపయోగించాలి..మన వాల్ పైన రాసే అధికారం అందరికి ఇవ్వకూడదు....మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి అందరికి కనిపించకుండా సెక్యూరిటీ పెట్టుకోవడం.. మనం ఎవరినుంచి ఐతే కామెంట్ అసిస్తున్నామో వాళ్ళకి మాత్రమే కనపడే విధంగా పోస్ట్ చేయడం....మనకు పరిచయం లేని వారి కామెంట్ ని మనసు గాయపర్చే విధంగా ఉన్నా... దాన్ని వ్యక్తిగతమైన కామెంట్ గా గుర్తించ కూడదు... మీకు ఇబ్బంది గలిగించే ఫ్రెండ్స్ ని మీ లిస్టు నుంచి తొలగించడం... ముఖ పరిచయం కూడా లేనివారికి మీ వ్యక్తిగత విషయాలు చెప్పకుండా ఉండడం..
పేస్ బుక్ ఒక రహదారి అనుకుంటే... దానిపై నడిచే ప్రతీ ఒక్కరు ఒక పూల మొక్క నాటితే అది అందరు మెచ్చే, ఆశ పడే అందాల వనం అవుతుంది..ఆలా కాకుండా ముళ్ళ పొదను వేస్తె అది శత్రువులకు సహకరించే అడవిగా మారుతుంది.. అందులో ప్రయాణించే వారిని శత్రువులుగా కుసంస్కారులుగా పరిగణించే పరిస్థితి వస్తుంది
పేస్ బుక్ ని ఒక స్నేహమయిగా చూసుకోండి.. మనకు అందుబాటులో ఉన్న దానిని మన చేతులారా ఒక శత్రువుగా మార్చే ప్రయత్నం చేయకండి..అసభ్యమైన పదజాలంతో కామెంట్ చేయకండి.. ఎవరైనా స్టేటస్ (ex: i feel alone....or sucide is best friend లేదా నన్ను ఎవరు ఇష్టపడడం లేదు..ఇలాంటివి పెడితే మీరు వారి మానసిక స్థితి తెలియనపుడు మీరు కామెంట్ చేయకుండా ఉండడమే ఉత్తమం..
మీరు ఒక రూపాయి దానం చేయకున్నా పర్లేదు..దేశం కోసం ఒక రక్తం చుక్క చిందించమని అడగడం లేదు. ఈ సోషల్ నెట్వర్క్ ని మాత్రం మీ మనసు లోని అనైతిక భావాలను పంచుకోవడానికి మాత్రం ఉపయోగించకండి.. మీ మనసు లోని అందమైన భావాలను నలుగురితో పంచుకోండి.. ఒకరిని ఒప్పించడానికో వేరేవరినో నొప్పించాదానికో మాత్రం ఉపయోగించకండి..
WHY WE NEED FACE BOOK...because it's a good thing to make friend and Facebook helps people to join, to make friends each other. It connects two friends each other who are very far at distance. Facebook is really really really awesome website. It connects people. IT IS A POPULAR ANSWER....
IT IS THE ONE SIDE OF THE FACE BOOK.....JUST FRIEND
BUT ANOTHER SIDE OF THE FACE BOOK....?????????
ANSWER IS IN YOUR HAND ONLY.........
friend ante emito cheppagalara
chala bagundi
frienship gurinchi edhina cheppagalara
chala bagudi