యండమూరి వీరేంద్రనాథ్ విజయం వైపు పయనం అనే పుస్తకంలో దిగులు అనేది సమస్య కాదు, అంతే కాదు అది సమస్యకు పరిష్కారం కూడా కాదు. దిగులు అనేది తప్పు చేసినదానికి పరితపించడం కూడా కాదు. విజయం వైపు పయనం ఆపే ఒక ఇనుప తెర..దిగులు ...భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అనే ఆలోచనలు మనిషిని దిగులు పడేట్టు చేస్తుంది. యండమూరి.. విజయం వైపు పయనం.. విజయం అందుకోవాలని పరితపించేవారికి ఒక చేయుతాగా నిలిచే పుస్తకం. దిగులు కలలో వచ్చినదానికి కూడా దిగులు పడడం సహజం, దిగులు తననే కాదు తన చుట్టూ ఉన్నవాళ్ళ ఆనందం కూడా దోచేస్తుంది అని ..ఇది విజయం అందుకోడానికి మనకు తెలియని ఒక ఇనుప చెర అంటారు యండమూరి గారు.
యండమూరి వీరేంద్రనాథ్....విజయం వైపు పయనం..దిగులు అంటే ఏమిటి
ఈ ప్రశ్న మీరెప్పుడైనా వేసుకున్నారా? వేనుకొని ఉంటే - మీరు చాలా హాయిగా ఉండే రకం అన్నమాట.
సాధారణంగా దిగులంటే తెలియని వాళ్ళే ఉండరు. చిన్నప్పటినుండి మనుషులు దిగులు పడుతూనే ఉంటారు.
మీ నేల జీతాన్ని ఎవరైనా జేబుదొంగ కొట్టేస్తే మీరెంత బాధపడతారో అంతే దిగులు స్కూల్ లులో రబ్బరు, పెన్సిల్ పోగొట్టుకున్న మీ పాపకు కలుగుతుంది.మనకు ఇష్టం లేనివి జరిగినపుడు, ఇష్టం ఉన్నవి జరగనప్పుడు మనకు దిగులొస్తుంది . తమ ప్రియురాలు ఆమె చెల్లెలితో మాట్లాడినా కొందరికి దిగులేస్తుంది.
కొందరు ఎప్పుడో గతంలో తాము చేసిన తప్పుగురించి ఇప్పుడు దిగులు పడుతుంటారు.అందువల్ల ప్రయోజనం అంటూ ఉండదు. గతంలో చేసిన తప్పును తలుచుకొని, భవిష్యత్తులో ఎలా ఉంటుందో అనుకుంటూ అందమైన వర్తమానాన్ని నాశనం చేసుకుంటున్నట్లే కదా ఈ విషయం వాళ్లకు అర్ధంకాదు.
ఓసారి నా దగ్గరకి ఓ కుర్రాడు వచ్చాడు. మనిషి చాలా దిగులుగా ఉన్నాడు. నాతో మాట్లాడిన అరగంటలో కనీసం ఇరవైసార్లు "నేను చాలా పొరపాటు చేశాను" అనే మాటను అన్నాడు. ఆతను ఎవరినీ హత్యచేయ్యలేదు. పదో తరగతి పరీక్షలు రాసేటపుడు ఫ్రెండ్సందరూ చూసి కాపీ కొడితే తనుకూడా కాపీ కొట్టేందుకు ప్రయత్నించాడట. ఇన్విజిలేటర్లు అతన్నీ, మరో నలుగుర్ని బయటికి పంపించారట. అతనికి అదో పెద్ద అవమానం కనక మర్చిపోలేక బాధపడుతున్నాడు. 'పోనీ ఏదయినా ఉద్యోగంలో చేరు' అన్నాను 'నాకు ఉద్యోగం ఎవరిస్తారు?భవిష్యత్తు ఎలా ఉంటుందో?' అలాంటి మాటలతోనే తన దిగులు వ్యక్తం చేసాడు.
ఊరికే కూర్చొని దిగులుగా ఆలోచించడం సహజం. కొందరికి నుదుట బొట్టులా దిగులొస్తుంది ఎప్పుడూ దైన్యంగా కనబడుతుంటారు. ఇంకో ఐదు నిమిషాల్లో ఆకాశం నెత్తిన పడుతుందన్నట్లు వుంటారు. వాస్తవానికి వీళ్ళకి దిగులు ఉండదు. దిగులుకే వీళ్ళు ఉంటారు. వాళ్ళముఖం తీరు, ప్రవర్తన తీరు అల్లాగే ఉంటాయి. ఇలాంటి వాళ్ళతో ఐదు నిముషాలు మాట్లాడితే మాక్కూడా 'దిగులు జబ్బు' అంటుకుంటుందనిపిస్తుంది.
కొంతమంది హాబీ ఆలోచించడం, దిగులుపడటం న్యూస్ పేపర్ కూడా దిగులుగా చదువుతారు. ఎప్పుడూ ఏదో ఒక ఉపద్రవంలో ఉన్నట్లే ఉంటారు.ఎప్పుడూ ఒక సమస్య వస్తూనే ఉంటుంది. తమ సమస్యేమీలేనప్పుడు ఇతరుల సమస్యల గురించి ఆలోచిస్తుంటారు. కొద్ది రోజులు తమ్ముడి ప్రమోషన్ గురించి, తర్వాత అతడి ట్రాన్స్ఫర్ గురించి...ఇలా ఏదో ఒక కారణానికి బాధపడుతూ ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడేటపుడు కూడా సమస్యల గురించి మాట్లాడుతారు. ఇటువంటి మనస్తత్వంవాళ్ళ అన్ని విషయాలలోనూ విపరీతమైన బాధ్యత కల్పించుకోవడము వల్ల జీవితాన్ని కాస్తయినా ఎంజాయ్ చేయడం అనేది తెలియకుండా వీళ్ళకి పోతుంది.