ఓషో(osho)- ఓషో పుస్తకాలు- ఓషో గురించి

ఓషో అంటే...
భగవాన్ శ్రీ రజనీష్ ' ఓషో' గా ప్రసిద్దులు. విలియం జేమ్స్ పదం 'ఓషయానిక్' నుంచి 'ఓషో' ను తీసుకోవడం జరిగిందని ఓషో వివరించారు. 'ఓషయానిక్' అంటే సాగరంలో సంలీనం కావడం. 'ఓషయానిక్' ఒక అనుభవానికి సంకేతం. అయితే మరీ అనుభవించేవారి సంగతేంటి? ఈ దృష్ట్యా ' ఓషో' అనే అర్ధవంతమైన పదాన్ని వాడుతున్నాం. కానీ తరువాత తెలిసింది 'ఓషో' అనే పదం చారిత్రిక కాలం నుంచి దూర ప్రాచ్యదేశాల్లో పరిగణలో ఉందని తెలుసుకున్నారు. "ఆశీర్వాదం అందుకున్న వ్యక్తి పైన ఆకాశం పూలజల్లు కురుపిస్తుంది" అని దీని అర్ధం.

ఓషో బోధనలు అన్ని వర్గీకరణలను తిరస్కరిస్తూ, అన్ని వర్గీకరణలకు అతీతంగా ఉంటున్నాయి. ఓ వ్యక్తి ఒంటరిగా చేస్తున్న స్వీయ అన్వేషణ గురించే కాకుండా, నేడు మానవజాతి ఎదుర్కొంటున్న అనేక అత్యవసర సామాజిక మరియు రాజకీయ అంశాల పట్ల చాలా సహజంగా బోధనలు సాగుతున్నాయి. ఓషో పుస్తకాలు వ్రాయలేదు - కానీ తన జీవిత కాలము 35 సంవత్సరాలపాటు  ఆయన మాట్లాడిన ఆడియో వీడియో ప్రవచనాల నుంచి పుస్తకాలుగా రూపొందించారు. 'సండే-టైమ్స్'అనే  లండన్ పత్రిక ఓషోని "20 వ శతాబ్దపు 1000 మంది నిర్మాతలలో ఒకరిగా" మరియు 'సండే-మిడ్-డే" అనే భారత పత్రిక భారతదేశ చరిత్రను తిరగరాసిన పదిమంది ప్రముఖులలో అంటే బుద్ధ, గాంధి మొదలైన వారి సరసన చేర్చింది. అంతేకాకుండా, ప్రముఖ అమెరికా రచయిత 'టారాబిన్స్' ఓషోను జీసస్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు.

ఓషో సహాయమంతా ఒక నవ్యమానవుడిని నిర్మించే దిశలో జరుగుతుంది. ఆ నవ్య మానవుడిని 'ఓషో జోర్బా ది బుద్ధా' అంటాడు. ఆ నవ్య మానవుడు ఏక కాలంలో నేలపై ఉంటూనే నింగిలోని చుక్కలను కూడా అందుకోగలడు. ఓషో తన మణిహారంలో అన్ని విషయాలను చేర్చుకున్నాడు.ఇటు సత్యాన్వేషణలో అసాధారణ ప్రజ్ఞ కలిగిన తూర్పుదేశాల జ్ఞానాన్ని, అటు శాస్త్ర, సాంకేతిక రంగాలలో అత్యంత శక్తిమంతమైన పడమటిదేశాల విజ్ఞాన సర్వస్వాన్ని తనదైన శైలిలో సమన్వయపరచారు.

చాలా వేగంగా మార్పులకు లోనవుతున్న జీవన విధానాలకు దీటుగా 'అంతఃపరివర్తన విజ్ఞానాన్ని' వివిధ పద్ధతుల ద్వారా ఈ కాలపు మనిషికి అందిచారు. సాధనలో నిరంతరం అడ్డుపడే శారీరక, మానసిక ఒత్తిడులను పారద్రోలిన తర్వాత ఆలోచనారహిత ధ్యాన అనుభవాన్ని సులువుగా అందించే విధంగా రూపొందించిన ఓషో 'చైతన్య ధ్యానాలు' (Active Meditations)నేడు అత్యుత్తమంగా నిలుస్తున్నాయి.

ఓషో పుస్తకాలు తెలుగులో 50 కంటే ఎక్కువే ఉన్నాయి.. అందులో కొన్ని మానసిక వ్యక్తిత్వానికి సంబంధించినవిగా చెప్పవచ్చు.. కొన్ని మానసిక ప్రశాంతతని చేకూర్చేవిగా చెప్పవచ్చు.. కానీ రజనీష్ అన్న పేరు కానీ, ఓషో అన్న పేరు కనిపించగానే కొంతమంది ఆ పుస్తకాలను వేలివేసే పద్దతిలో చూడడం కొంత విచారకరమైన విషయం. ఎందుకంటే చాలామంది అట్టపై కనిపించే పేరుకి మాత్రమే విలువిస్తారు కాబట్టి. ఉదా:" ప్రేమ రహస్యాలు" ముందు మాట  ఏమని ఉంటుంది అంటే..

మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నుంచి
ప్రేమ దాని ఉనికి,
ప్రేమ ఎందుకు ఎప్పుడు ఎలా
ద్వేషంగా మారుతుంది.
ప్రేమకు స్వేచ్చనిస్తే ఏమవుతుంది,
ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయో
తెలుసుకునేవారి కోసం
"ప్రేమ రహస్యాలు" ఓషో రచన...

ఈ  "ప్రేమ రహస్యాలు" అన్న పుస్తకం ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకంగా అంగీకరించరు. ఎందుకంటే ఓషో చెప్పే కఠినమైన మాటలు రుచించక పోవడంవల్ల, అతన్ని జీవితంపై వేలెత్తి చూపుతూ అతని రచనలను తప్పు పడుతున్నారు. ఇలానే ఓషో  మహిళ, ఆనందం ... ఇంకా ఎన్నో కూడా చాలా అరుదైన భావాలు జోడించిన పుస్తకాలు.

ఓషో పుస్తకాలు చదవాలంటే కఠినమైన వాస్తవాలను అంగీకరించే మనసు , జీవితాన్ని నిజాయితీగా సందర్శించే గుణము కూడా ఉండాలి.  మనసుతో అబద్దం చెప్పని వ్యక్తి తప్పక ఆదరించేవి ఓషో పుస్తకాలు.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!