అదృష్టమంటే....అదృష్టవంతులు అంటే......

అదృష్టమంటే ..... కష్టపడి ఫలితం అందుకోవడమా.... కష్టపడకుండా అందలం ఎక్కడమా... అదృష్టవంతులు అంటే ఒంటరిపోరాటం చేసి గెలిచినవాళ్ళా.... పోరాటమే లేకుండా అందుకునేవాళ్ళా.....డబ్బు ఉన్నవాడా.... డబ్బు చూడని వాడా.. అయాచితంగా వచ్చినదాన్ని  వదులుకోవాలనుకునేవాడా..... అందుకునేవాడా...

ఒక అడవిలో వేటగాడు ఉన్నాడు..ఆతను  రోజు అడవి అంతా తిరిగి వల విసిరి అందులో చిక్కుకున్న వాటిలో నుండి అందమైన వాటిని మాత్రమే ఇంటికి తీసుకెళ్ళేవాడు.. ఒకరోజు వలలో ఒక బంగారు రెక్కల నెమలి వలలో చిక్కుకుంది, సాయంత్రం వేటగాడు దాన్ని పట్టుకొని ఇంటికి బయలుదేరుతుండగా, ఆ నెమలి "ఓ మానవా నేను ఒక గంధర్వుడను, నేను ఆదమరచి విహరించుచు సమయము చూసుకోనక    సూర్య కిరణములు తాకి నీ చేత చిక్కినాను, వెన్నెల వెలుగు వచ్చినంతనే  నేను నా రూపు ధరించి వెళ్ళిపోయెదను  నీవు నన్ను విడిచిపెట్టుము అని వేడుకొనెను".

ఇది నా వృత్తి ..ప్రవృత్తి... నీవు యిలా కోరుట న్యాయసమ్మతం కాదు, అయినప్పటికీ నేను దయతలచి, నిన్ను వదిలిపెట్టేదను, ఇందుకు నేను ఏమి ప్రతిఫలం ఆశించి చేయడం లేదు అని వేటగాడు పలికెను.. ఒక మానవుడు అటువంటి ఉన్నతమైన అభిలాషను కలిగిఉండడం గంధర్వుడిలో అహాన్ని రేకెత్తించింది.  నీకు అందమైన జంతువులన్న ప్రీతి కదా, నీవు వల వేస్తె అందులో తప్పక ఒక కస్తూరి జింక పడుడుంది అని నీవు నన్ను వదిలినందుకు ఈ వరం తప్పక స్వీకరించవలెను అని పట్టుపట్టెను.

మీరు మాకంటే ఉన్నతమైనవారు కదా, మీ మాటా కాదనలేదు ...అలాగే నని  వేటగాడు అంగీకరించి గంధర్వుడిని వదిలి ఇంటికి వెడలిపోయెను. మరునాడు వల తీసుకొని మధ్యానం  ఒక కొండ మీదకి వెళ్ళి వల విసిరెను,  అందులో కస్తూరి జింక  చిక్కుకొనెను దాన్ని తీసుకొని, అడవిలో వదిలి వెళ్ళిపోయెను, ఇంకొకరోజు నది మధ్యన వల విసిరెను, అందు చిక్కుకున్న జింకను మళ్లీ అడివిలో వదిలి వెళ్ళెను, ఇంకోరోజు ఎత్తైన మర్రి వృక్షముపై వల వేసెను, మరియొకరోజు అర్ధరాత్రి ఇంట్లోనే వల వేసెను, ఎక్కడవేసిన జింక చిక్కుతున్నది.. ఒకరోజు కొలిమిపై వల వేయబోయెను, అపుడు గంధర్వుడు ఆ వేటగాడి ఎదుట నిలిచి మహాత్మా నాపై దయదలుచు...నీ కోసం నిన్ను అదృష్టవంతుడిని చేయడం కోసం నేను జింకను చేతపట్టుకొని నీవు వల వేసే సమయం కోసం వేచి ఉండలేను... నా వరం నేను తీసుకుంటా..నీ వృత్తి నువ్వు చేసుకో అన్నాడు..   అపుడు వేటగాడు మీరు ఎలా చెపితే అలానే అన్నాడు చిరునవ్వుతో...

ఎవరో కష్టపడితే  ఆ ప్రతిఫలాన్ని అందుకోడానికి ఇష్టపడక, అదృష్టవంతుడివి అనే మాటకు అర్ధం చెప్పిన వేటగాడి లాంటి మనుషులు ఇపుడు కూడా ఉన్నారా అంటే.... ఉన్నారు కానీ తక్కువ శాతం..... ఎవరి సహాయం ఆశించకుండా ఒంటరి పోరాటం చేసేవాళ్ళు తక్కువ.. ఏది ఎవరికీ కష్టపడకుండా అందదు..కాకపొతే కొందరి విషయంలో కష్టపడకుండా అందుకున్న అదృష్టవంతులు అని చెప్పేముందు, అతని కష్టాన్ని పంచుకున్న ఇంకొకరు ఉండే ఉంటారు, మీకు తెలిసి ఉండొచ్చు...తెలియపోయి ఉండొచ్చు....

ఒక చదువుకున్న వాడి వెనుక కూర్చున్న  సరిగా చదవని వాడు పరీక్ష పాస్ అయివుండొచ్చు, అంత మాత్రాన  చదవని వాడు అదృష్టవంతుడు అనడం ఎంత సబబో.. ఎదుటివాడి కష్టాన్ని దోచుకున్నాడు అన్నది అంతే సత్యం.. తాత సంపాదించినా ఆస్థిని పొందిన మనవడు ఐనా.. అలవోకగా పెద్ద కంపెనీ డైరెక్టర్ ఐనా అది వాళ్ళ తాత తండ్రుల కష్టఫలమే...

దురదృష్టానికి అందరిని బాధ్యులు చేసే వాళ్ళు... అదృష్టానికి మాత్రం తోడు ఎవరులేరు అని అంటారెందుకో...అలవోకగా అందలం అందుకున్నవాళ్ళంతా కష్టపడే అందుకుని ఉంటారు అది మీకు తెలిసి ఉండకోపోవచ్చు, కష్టపడకుండా అందుకున్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ అందుకోడం లో వేరొకరి కష్టం ఉండి ఉంటుంది....కానీ ఒప్పుకోడానికి 'అహం' అడ్డు తప్పుకోదు కదా....

మీరు అందలం ఎక్కడం వెనుకా, మీరు అదృష్టవంతులు అని మీరు అనుకోడం వెనుకా ఎవరి సహాయ సహకారాలు ఉంటే అవి ఎవరికీ తెలియకున్నా మీకు, మీ మనసుకు తెలుస్తాయి.... వాళ్ళ సహకారం (డబ్బు, మాట సహాయం, ఓదార్పు.... ) ఏదైనా కానీ....ఎవరైనా కానీ ( తల్లి, తండ్రి, సహచరుడు.....) మీ జీవితంలో ఒకసారి ఐనా వారికి, వారి నుంచి మీరు అందుకున్న సహకారం  గురించి తెలియచెప్పడం మానవ కనీస ధర్మం..

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!