ఒకానొక సమయం ..
ఎడారిలా మారుతూ ఉంటుందేమో
ఎవరికీ చెందని నిశ్శబ్దంలా అనిపిస్తుంది..
తెలియని గుబులతో.....
తల్లడిల్లే మనసు
గాయాల బాట పడుతుంది...
నీకు గుర్తుందా..
అప్పటి ఆ సమయాన్ని
తటిల్లున మెరిసిన మెరుపులా
నీవు అందుకోవడం...
నా సమయాన్ని
నీ సొంతం చేసుకొని
మాటలు నాటి వెళ్లడం...
ఓయ్
ఇంతకన్నా ఏం కావాలి
నీకు కట్టుబడి పోవడానికి